India vs England 5th Test Day 1 Highlights | పుంజుకుంటున్న టీం ఇండియా

Continues below advertisement

మాంచెస్టర్ లో ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా కాస్త తడబడ్డా కూడా డ్రా తో సరిపెట్టుకున్నారు. కానీ ఐదవ టెస్ట్ లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ పట్టుదలతో ఉన్నాయి. ఓవల్ లో జరుగుతున్న ఐదవ టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాట్టింగ్ చేస్తున్న ఇండియా ... ఒక దశలో వరుస వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన భారత బ్యాటర్లు తడబడ్డారు. వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం కలిగింది. కానీ ఇంగ్లాండ్ పూర్తి ఆధిపత్యం చూపించింది. తొలిరోజు ఆట‌ముగిసేస‌రికి 64 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 204 ప‌రుగులు చేసింది టీం ఇండియా. 

38 పరుగులకే ఓపెనర్లు జైస్వాల్.. రాహుల్ ఇద్దరు పెవీలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కలిసి మూడో వికెట్‌కి 45 పరుగుల పార్టనర్ షిప్ చేసారు. వర్షం వల్ల ఆటకి అంతరాయం కలిగింది. బ్రేక్ తర్వాత ... కొద్దిసేపటికే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రనౌట్ అయ్యాడు. ఆ వెంటనే సాయి సుదర్శన్, జోష్ టంగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. క‌రుణ్ నాయ‌ర్ అర్ద సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో కరుణ్ తోపాటు వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో రోజు భారీ స్కోర్ చేయాలి. ఆలా అయితేనే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిపత్యం చూపించగలదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola