India vs England 4th Test | ముగ్గురు వికెట్ కీపర్లతో నాలుగో టెస్టు మ్యాచ్
Continues below advertisement
ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో నాలుగవ టెస్ట్ మ్యాచ్ మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. అయితే ఈ గ్రౌండ్ లో ఇండియా ఇప్పటి వరకు ఒక సారి కూడా మ్యాచ్ గెలవలేదు. దాంతో ఎలాగైనా ఈ సారి గెలిచి రికార్డు క్రియేట్ చేయాలనీ చూస్తోంది. జరిగిన మూడు టెస్టుల ఆధారంగా ఈ మ్యాచ్ లో ఫైనల్ టీం ను సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. లార్డ్స్ లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్ లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ కీపింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. ఎడమ చేతి వేలికి గాయం కావడంతో మ్యాచ్ మొత్తం వికెట్ కీపింగ్ చేయలేకపోయాడు. అదే మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ బానే బ్యాటింగ్ చేసినప్పటికీ కూడా ... రెండవ ఇన్నింగ్స్‌లో వేలిలో నొప్పితో ఇబ్బంది పడ్డాడు. నాల్గవ టెస్ట్ మ్యాచ్ కోసం టీం ఇండియా బెకెన్‌హామ్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. రిషబ్ పంత్ కూడా బ్యాట్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కానీ వికెట్ కీపింగ్ చేయగలడా లేదా అన్నది అందరి డౌట్. రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేక పోతే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ గా ఆడించే అవకాశం ఉంది. వికెట్ కీపర్లుగా కెఎల్ రాహుల్ లేదా ధ్రువ్ జురెల్ కు ఛాన్స్ దొరికే అవకాశం ఉంది. రాహుల్ కు వికెట్ కీపర్‌గా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే రాహుల్ కు కీపింగ్ ఇస్తారు అని కూడా టాక్ వినిపిస్తుంది. ఆలా జరిగితే ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫైనల్ అయితే మాత్రం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ లో టీం ఇండియా ముగ్గురు వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్‌లతో రంగంలోకి దిగినా ఆశ్చర్యం లేదు.
Continues below advertisement