India vs England 3rd Test Nitish Bowling | లార్డ్స్‌ టెస్టులో నితీష్‌ రెడ్డి స్పెషల్ షో

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా మరోసారి టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఇంగ్లాండ్ జట్టు దూకుడు ప్రదర్శించకుండా ... మెల్లగా రన్స్ చేస్తూ వికెట్స్ ని కాపాడుకుంటూ వచ్చింది. మ్యాచ్ మొదలై పది ఓవర్లు గడిచినా కూడా ఒక వికెట్ పడలేదు. దాంతో నితీష్‌ రెడ్డిని బౌలింగ్‌కు దించాడు కెప్టెన్ శుబ్మన్ గిల్. 

కెప్టెన్ తనపై ఉంచి నమ్మకాన్ని నితీష్ ప్రూవ్ చేసుకున్నాడు. ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ ను పెవిలియన్ చేర్చాడు. అయితే నితీశ్ బౌలింగ్‌ని టీమిండియా కెప్టెన్ గిల్ తెలుగులో అభినందించాడు. ‘బాగుంది రా మావ...’ అంటూ శుబ్‌మన్ గిల్, నితీశ్‌తో అనడం స్టంప్ మైక్ లో రికార్డు అయింది. కెప్టెన్ తెలుగులో మాట్లాడడంతో ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. 

ఇంగ్లాండ్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో ... తోలి టెస్ట్ మ్యాచ్ లో నితీష్ ను ప్లేయింగ్ 11 లో తీసుకోలేదు. రెండవ టెస్ట్ లో మాత్రం ఆల్ రౌండర్ గా టీంలోకి వచ్చాడు  ఈ తెలుగు కుర్రాడు. రెండు ఇన్నింగ్స్ కలిపి కేవలం 2 పరుగులు మాత్రమే చేసాడు. బౌలింగ్ పరంగా కూడా మంచి ప్రదర్శనను కనబర్చలేక పొయ్యాడు. దాంతో మూడవ టెస్ట్ మ్యాచ్ లో నితీష్ ప్లేస్ పై డౌట్స్ మొదలైయ్యాయి. కానీ కెప్టెన్ గిల్ మాత్రం తన టీం మెట్ పై నమ్మకంతో మూడవ టెస్ట్ లో ప్లేయింగ్ 11 లో నితీష్ పేరును చేర్చాడు. ఆలా కెప్టెన్ తనపై ఉంచి నమ్మకాన్ని నితీష్ ప్రూవ్ చేసుకొని బౌలింగ్ పరంగా మంచి ప్రదర్శన కనబర్చాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola