India vs England 2nd Test Match Highlights | ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం

స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్టులో రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత జరిగిన తోలి టెస్ట్ మ్యాచ్ ఇండియా vs ఇంగ్లాండ్. 
భారత టెస్ట్ కెప్టెన్ గా చిన్న వయసులోనే పెద్ద భాద్యతను శుబ్మన్ గిల్ కు అందించారు. దాంతో ఫ్యాన్స్ అంతా టెస్ట్ క్రికెట్ పై ఆల్మోస్ట్ ఆశలు వదులుకున్నారు. ఇంగ్లాండ్ తో జరిగిన తోలి టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడంతో సీనియర్లు లేని లోటు తెలుస్తుందంటూ శుబ్మన్ గిల్ ను ట్రోల్ కూడా చేసారు. కానీ అందుకు బదులుగా రెండవ టెస్ట్ మ్యాచ్ లో రికార్డుల మోత మోగిస్తూ.. మ్యాచ్ గెలిచి అందరికి ఆన్సర్ ఇచ్చాడు యువ కెప్టెన్ శుబ్మన్ గిల్. 

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టిన ఇండియా యంగ్ టీం సంచలనం సృష్టించింది. తొలి టెస్టులో ప్రయత్నించి తడబడినా కూడా రెండవ టెస్ట్ లో 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్‌పై రికార్డు విజయం సాధించింది. ఎడ్జ్‌బస్టన్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించి, టెస్టు మ్యాచ్ గెలిచిన మొట్టమొదటి ఆసియా జట్టుగా భారత్ నిలిచింది. 

608 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ .. రెండో ఇన్నింగ్స్‌లో 68.1 ఓవర్లు బ్యాటింగ్ చేసి 271 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 72/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు బ్యాటింగ్ మొదలయింది. భారీ వర్షం వల్ల మార్నింగ్ సెషన్ ఆలస్యంగా మొదలైనప్పటికీ .... మ్యాచ్ మొదలు కాగానే భారత బౌలర్లు చెలరేగిపొయ్యారు. వరుస వికెట్లు తీస్తూ... ఇంగ్లాండ్ బ్యాటర్స్ కి చుక్కలు చూపించారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్ 6 వికెట్లు తీసి, ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. అలాగే సిరాజ్ ఈ మ్యాచ్ లో 7 వికెట్లు తీసాడు. ఇక కెప్టెన్ గా గిల్ కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మూడో టెస్టు జులై 10 నుంచి లండన్ లోని లార్డ్స్ లో జరగనుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola