India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
అండర్ 19 ప్రపంచకప్ 2026 (U19 World Cup 2026)లో టీమిండియా దూసుకుపోతుంది. వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి డక్ వర్త్ లూయిస్ పద్దతిలో 18 పరుగుల తేడాతో గెలిచింది. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఒక దశలో భారత్ ఓడిపోతుందని అందరు అనుకున్నారు. కానీ టీమిండియా కుర్రాళ్లు మాత్రం ఎక్కడా తగ్గకుండా పోరాడి గెలిచారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ సూర్యవంశీ 72 పరుగులు చేసాడు. మిగిలిన ప్లేయర్లు అంతగా రాణించలేక పొయ్యారు.
వర్షం కారణంగా బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 29 ఓవర్లలో 165 పరుగులకు కుదించారు. వరుసగా బౌండరీలు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు బంగ్లా బ్యాట్స్మన్. 36 బంతుల్లో 41 పరుగులు చేస్తే విజయాన్ని సొంతం చేసుకుంటుంది బంగ్లాదేశ్. అప్పటికి 7 వికెట్లు ఇంకా వారికీ మిగిలి ఉన్నాయి. కానీ మన కుర్రాళ్లు బంగ్లాదేశ్ బ్యాట్సమన్ ను ముప్పుతిప్పలు పెట్టారు. వరుసగా వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ చివరి 7 వికెట్లు 22 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. దాంతో బాంగ్లాదేశ్ ఓటమి పాలయింది.