India vs Australia | Womens World Cup 2025 | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఢీ
ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీ-ఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు టీమ్స్ ఎదురు చూస్తున్నాయి. లీగ్ స్టేజ్ లో ఆస్ట్రేలియా టీమ్ ఇండియాను చిత్తూ చిత్తుగా ఓడించింది. దాంతో సెమీ ఫైనల్ లో ఎలాగైనా మ్యాచ్ గెలిచి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ఫైనల్ బెర్త్ పై కూడా భారత్ కన్నేసింది.
ఈ మ్యాచ్ లో ఇండియా టీమ్ చాలా కీలకం. ఇప్పటికే ఓపెనర్ ప్రతీక గాయం కారణంగా మ్యాచ్ ఆడడం లేదు. అయితే, ఈ టోర్నమెంట్ లో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. కాబట్టి, టీమ్ ఇండియా ఖచ్చితంగా మెరుగ్గా ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు టీమ్ ఇప్పటివరకు 14 మ్యాచ్‌లు ఆడితే.. ఆస్ట్రేలియా 11 మ్యాచ్‌లు గెలిచింది. టీమిండియా మూడు మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగింది. ఈ సెమీ-ఫైనల్ లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఫైనల్ బెర్త్ ను కైవసం చేసుకుంటుందా లేదా చూడాలి.