India vs Australia Womens T20 Series | ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గర్జన

Continues below advertisement

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను ( India Women vs Australia Women ) ఓడించి టీమిండియా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. అడిలైడ్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన ( Smriti Mandhana ) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడగా, జెమీమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues ) కీలక హాఫ్ సెంచరీతో రాణించింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేశారు.

ఈ విజయంలో కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన శ్రీచరణి ( Sricharani ) కీలక పాత్ర పోషించింది. ఫోబీ లిచ్‌ఫీల్డ్, గ్రేస్ హ్యారిస్ వంటి డేంజరస్ బ్యాటర్లను అవుట్ చేసి ఆసీస్ పతనాన్ని శాసించింది. వన్డే ప్రపంచకప్ తర్వాత కాస్త ఫామ్ కోల్పోయినట్లు కనిపించినా, ఈ మ్యాచ్‌తో తన సత్తా ఏంటో మళ్ళీ నిరూపించుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola