India vs Australia | Women's World Cup | ఆసీస్ తో భారత్ ఢీ
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ చివరికి చేరుకుంది. లీగ్ స్టేజ్ లో వరుసగా మ్యాచులను ఓడిపోయిన టీమ్ ఇండియా తడబడుతూ లేస్తూ.. సెమి ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్ టాప్-4లో నిలిచాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంతో లీగ్ స్టేజ్‌ను ముగించింది. భారత్ నాలుగో ప్లేసులో ఉంది. లీగ్ స్టేజ్ ఆస్ట్రేలియాతో చిత్తుగా ఓడిపోయిన భారత్ వారితోనే సెమిస్ ఆడనుంది.
ఆస్ట్రేలియా బౌలింగ్ బ్యాటింగ్ పరంగా విశ్వరూపం చూపిస్తుంది. న్యూజీలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి టీమ్ కు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్స్ తీస్తూ.. స్కోర్ ను పెంచకుండా అడ్డుకుంటూ .. చాలా స్ట్రాంగ్ టీమ్ అని ప్రూవ్ చేసుకున్నారు. అయితే లీగ్ స్టేజ్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇదే పరిస్థితి.
ఈ సంవత్సరం ఎలాగైనా కప్ సొంతం చేసుకోవాలని టీమ్ ఇండియా బలంగా కోరుకుంటుంది. కాబట్టి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో ఎక్కడా తప్పులు చేయకుండా .. మంచి ప్లాన్ తో బరిలోకి దిగాల్సి ఉంటుంది. చూడాలి మరి డిఫెండింగ్ ఛాంపియన్స్ ను సెమి ఫైనల్ లో టీమ్ ఇండియా ఎలా ఎదుర్కుంటుందో.