India vs Australia T20 Match | నేడు ఆస్ట్రేలియాతో భారత్ ఐదవ టీ20
భారత్ - ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ గాబా స్టేడియంలో జరగనుంది. నాల్గో టీ20లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమ్ ఇండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యాన్ని సాధించింది. ఎలాగైనా ఈ మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు మన ఆటగాళ్లు. అయితే ఇక్కడ ప్లేయింగ్ 11 పై అందరు చర్చించడం మొదలు పెట్టారు. అందరు ఊహించిన దాని కన్నా చాలా భినంగా టీమ్ ను సెలెక్ట్ చేస్తున్నాడు హెడ్ కోచ్ గంభీర్.
ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే.. ఈ సిరీస్‌లో తిలక్ వర్మ 4 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 84 పరుగులు మాత్రమే చేశాడు. చివరి మ్యాచ్‌లో తిలక్ వర్మ తన ఫామ్‌ను తిరిగి పొందడానికి ప్రయత్నిస్తున్నాడు. అభిషేక్ శర్మ మంచి ప్రదర్శన కనబర్చాడు. సూర్యకుమార్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తాడా.. లేదా ఓపెనర్ గా వస్తాడా అన్నది చూడాలి. బ్యాట్‌తో శివమ్ దూబే ప్రభావం చూపించలేకపోయినా, బౌలింగ్‌తో గేమ్‌ను మారుస్తున్నాడు. గాబా స్టేడియం పిచ్‌లో బౌన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్... వీరిలో ఎవరైనా రాణిస్తే ఆస్ట్రేలియాను ఓడించడం కష్టం అవుతుంది. భారత్ vs ఆస్ట్రేలియా ఐదో టీ20లో వర్షం పడే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ రద్దయితే భారత్ సిరీస్‌ను 2-1తో గెలుస్తుంది.