India vs Australia ODI 2025 Head to Head Records | భారత్ - ఆస్ట్రేలియా రికార్డ్స్

Continues below advertisement

భారత్- ఆస్ట్రేలియా సిరీస్ కోసం రెండు టీమ్స్ ప్రిపరేషన్ మొదలు పెట్టాయి. తోలి వన్ డే మ్యాచ్ పెర్త్‌ వేదికగా జరగనుంది. యంగ్ ప్లేయర్ శుబ్మన్ గిల్ కు వన్ డే కెప్టెన్ గా ఇది తోలి సిరీస్. టీమ్ఇండియా ఎలాగైనా ఈ సిరీస్ గెలవాలని కసిగా ఉంది. సో ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్​ రికార్డ్స్ ఏంటో ఒకసారి చూదాం. 

ఇప్పటివరకు భారత్- ఆస్ట్రేలియా మధ్య 152 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమ్ ఇండియా 58 మ్యాచ్‌లలో గెలిస్తే ఆస్ట్రేలియా 84 మ్యాచ్‌లలో గెలిచింది. ఇలా చూస్తే ఆస్ట్రేలియా ఇండియాపై వన్డేల్లో ఆధిక్యం చూపిస్తుంది. కాబట్టి ఈసారి పోటీ హోరాహోరీగా ఉండడం ఖాయం. 2019 నుంచి 2023 వరకు జరిగిన 5 వన్ డే సిరీస్ లో ఆస్ట్రేలియా 3 సార్లు.. భారత్ 2 సార్లు సిరీస్ ను కైవసం చేసుకుంది. 

ఈ రెండు టీమ్స్ మధ్య చివరి వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్​లో జరిగింది. ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగింది. భారత్​ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు జరగబోతున్న సిరీస్ లో అందరి ద్రుష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఉంది. వీళ్లిద్దరు కలిసి టీమ్ ఇండియాను ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola