India vs Australia 2025 | Shafali Verma | సెమీస్‌కు ముందు భారత జట్టులో షెఫాలీ

Continues below advertisement

వరల్డ్ కప్ సెమీస్ ముందు టీమిండియాకు శుభవార్త అందింది. భారత జట్టులో షెఫాలీ వర్మ వచ్చింది. పవర్ హిట్టింగ్ తో మ్యాచ్ ను మలుపు తిప్పగల షెఫాలీ టీమ్ లో ఉంది అంటే ప్రత్యర్థులు అలోచించి ఆడాల్సి ఉంటుంది. ఆడింది చాలా తక్కువ మ్యాచులు అయినప్పటికి... మంచి ఇంపాక్ట్ ప్లేయర్ అనే చెప్పాలి. ఇండియా బాంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ ప్రతీక గాయపడింది. తన స్థానంలో షెఫాలీ వర్మ స్క్వాడ్ లో చేర్చారు. 

21 ఏళ్ల ఈ డాషింగ్ బ్యాటర్ సెమీఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియాకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చింది. 'సెమీఫైనల్ వంటి మ్యాచ్‌కు టీమ్ లో చేరడం అంటే పెద్ద సవాల్. కానీ, ఇలాంటి కీలక సందర్భంలో ఆడడం నాకెంతో ప్రేరణనిస్తుంది. నా గేమ్ ను ఎంత సింపుల్‌గా ఉంచుకుంటే, అంత బాగా ప్రదర్శిస్తాను. నాకు అవకాశం వస్తే, బెస్ట్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తా. టీమ్ కోసం ఏదైనా చేస్తాను. నా బెస్ట్ ఇస్తాను.. అంతే” అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది లేడీ సెహ్వాగ్. స్మ్రితి మందాన, షఫాలీ రూపంలో ఆసీస్ మ్యాచ్ లో సూపర్ ఓపెనింగ్ పెయిర్ దక్కింది అనే చెప్పాలి. ఇదే దూకుడుతో భారత్ ఫైనల్ చేసుకోవాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola