India vs Afghanistan ODI Series | ఆఫ్ఘనిస్థాన్‌ను 170 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్

Continues below advertisement

టీమిండియా కొత్త వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అఫ్గానిస్తాన్‌తో జరిగిన సెకండ్ వన్డేలో ఇండియా 170 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. దీనితో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. కెప్టెన్‌గా గిల్‌కు ఇది ఫస్ట్ సిరీస్ విజయం.

టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 402 పరుగుల స్కోర్ బోర్డుపై పెట్టింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ పొజిషన్ వదులుకుని నంబర్ 3లో వచ్చాడు. ఈ డెసిషన్ సూపర్ హిట్ అయింది. గిల్ వన్డేల్లో తన క్లాస్ చూపిస్తూ కేవలం 110 బంతుల్లోనే 154 రన్స్ చేసి అఫ్గాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. 

ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లోనే 125 రన్స్‌తో విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరూ సెకండ్ వికెట్‌కు రికార్డు స్థాయిలో 224 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేశారు. ఇక 403 రన్స్ భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్.. మన బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 రన్స్‌కే ఆలౌట్ అయింది. అఫ్గాన్ బ్యాటర్ రహ్మత్ షా 79 రన్స్ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola