రివెంజ్ ముఖ్యం బిగిలు.. సిరీస్ కొట్టేయాలని పట్టుదలగా ఉన్న టీమిండియా
ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య నేడు బుధవారం రాయ్ పుర్ లో రెండో వన్డే జరగబోతున్న టైంలో ఫ్యాన్స్ అంతా ఒక్కటే అంటున్నారు.. మ్యాచ్ గెలవాల.. సిరీస్ పట్టాల.. రివెంజ్ ముఖ్యం బిగిలు అంటున్నారు. రాంచీలో థ్రిల్లింగ్ విక్తరీతో 3 వన్డేల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలోకి వచ్చిన టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిచి ఓ మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ పట్టేయాలని, టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు రివెంజ్ తీర్చుకోవాలని కసిగా ఉంది.
అయితే ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియాకి చెమటలు పట్టించి తృటిలో మ్యాచ్ చేజార్చుకున్న సఫారీ జట్టు.. ఈ మ్యాచ్ లో మాత్రం తొలి మ్యాచ్ తప్పులు చేయకుండా ఎలాగైనా గెలవాలని, సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇక రోహిత్, కోహ్లీ సూపర్ ఫామ్ లో ఉండటంతో పాటు మిదిలార్దర్ లో రాహుల్, జడేజా కూడా స్ట్రాంగ్ గా ఆడుతుండటం టీమిండియాకి కలిసొచ్చే అంశం అయితే.. గాయంతో ఫస్ట్ వన్డే కు దూరమైన భవూమా ఈ మ్యాచ్ లో జట్టులోకి తిరిగివచ్చిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే టీమిండియాలో సుందర్ ప్లేస్ లో తిలక్ వర్మ జట్టులోకి రావచ్చని టాక్ వినిపిస్తోంది. మరి ఈ మ్యాచ్ లో గెలిచి టీమిండియా సిరీస్ సొంతం చేసుకుంటుందా? అనేది చూడాలి.