ఆ ఒక్క క్యాచ్ వదలకుండా ఉంటే భారత్ మ్యాచ్ గెలిచేది
359 పరుగుల టార్గెట్.. సౌతాఫ్రికా కలలో కూడా ఛేజ్ చేయలేదనుకున్నారు ఇండియన్ ఫ్యాన్స్. కానీ ఒక్క క్యాచ్.. ఒకే ఒక్క క్యాచ్ భారత్ ఓటమికి పునాది వేసింది. సౌతాఫ్రికా రికార్డ్ విక్టరీ సాధించడానికి కారణమైంది. ముందుగా కింగ్ కోహ్లీ, రుతురాజ్ డబుల్ ధమాకా సెంచరీలతో పరుగుల వరద పారించడంతో టీమిండియా ఏకంగా 359 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక ఛేజింగ్‌లో ఓపెనర్ క్వింటన్ డీకాక్ 8 రన్స్‌కే అవుట్ కావడంతో ఇక గెలుపు మనదే అనుకున్నారంతా. కానీ.. మరో ఓపెనర్ ఎయిడెన్ మార్క్రమ్.. కెప్టెన్ టెంబా బవూమాతో కలిసి దూకుడుగా ఆడటం మొదలుపెట్టాడు.
అదే ఊపులో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత 53 పరుగుల వద్ద.. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టడానికి ట్రై చేశాడు మార్‌క్రమ్. కానీ కరెక్ట్‌గా టైమింగ్ చేయలేకపోవడంతో బంతి ఎడ్జ్ తాకి థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జైస్వాల్ ఆ ఈజీ క్యాచ్‌ను వదిలేయడంతో.. పాటు సిక్స్ కూడా ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి మార్‌క్రమ్ ఇంకా విజృంభించాడు. బౌండరీల మోత మోగించాడు. ఏకంగా 98 బంతుల్లో 110 రన్స్‌తో సూపర్ సెంచరీ బాది మ్యాచ్ గెలవడంలో కీ రోల్ పోషించాడు.
ఒక్క జైస్వాల్ మాత్రమే కాదు.. టీమిండియా ప్లేయర్లలో చాలామంది పరమ చెత్త ఫీల్డింగ్‌తో ఆపగలిగే బౌండరీలను కూడా ఆపలేక దాదాపు 30 పరుగుల వరకు సమర్పించుకున్నారు. ఒకవేళ ఆ పరుగులను ఆపగలిగి ఉంటే.. టీమిండియా తప్పకుండా గెలిచేది. ఇక ఈ ఫీల్డింగ్ చూసిన ఫ్యాన్స్.. ఇదెక్కడి చెత్త ఫీల్డింగ్‌రా బాబూ అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారు.