టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు 4వ t20 మ్యాచ్ జరగబోతోంది. లక్నోలోని ఏకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఈ పిచ్ పై ఇప్పటివరకు మొత్తంగా 3 ఇంటర్నేషనల్ t20 మ్యాచులు ఆడిన టీమిండియా 3 మ్యాచుల్లోనూ గెలిచింది. అయితే ప్రస్తుతం టీమిండియా ఫామ్, బ్యాటింగ్ ఫెయిల్యూర్స్ చూస్తుంటే ఈ ఓటమిలేని రికార్డ్ నైనా భారత టీం నిలబెట్టుకుందా? లేదా? అనే డౌట్ ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ Suryakumar యాదవ్, వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ బ్యాటింగ్ లో పూర్తిగా ఫెయిల్ అవుతుండటం టీంకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మ్యాచ్ లో అయినా వీళ్ళు ఫామ్ అందుకుని భారీ స్థాయిలో పరుగులు చేయకపోతే ఈ రికార్డ్ కూడా పోగొట్టుకుంటామెమో అని అభిమానులు భయపడుతున్నారు. ఇది మాత్రమే కాకుండా ఇప్పటివరకు ఈ సిరీస్ లో జరిగిన 3 టీ20ల్లో 2 మ్యాచ్ లు గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. అంటే రెండు రకాలుగా ఈ మ్యాచ్ గెలవడం sky సేనకి చాలా ఇంపార్టెంట్ అన్న మాట. అయితే మరోవైపు ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలను నిలబెట్టుకోవాలని సౌతాఫ్రికా కూడా పట్టుదలగా బరిలోకి దిగబోతోంది.