India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

Continues below advertisement

దంబుల్లా వేదికగా జరిగిన వన్డే సిరీస్ ఫైనల్లో భారత్ ఏ జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. పరుగుల వరద పారిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టును 66 పరుగుల తేడాతో ఓడించి భారత్ ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో లంక టేబుల్ టాపర్‌గా నిలిచినా, ఫైనల్లో మాత్రం టీమిండియా యువ సంచలనాలు విశ్వరూపం చూపించారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఊహించని విధ్వంసకర ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ 29 బంతుల్లో 94 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. దాంతో భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోరు సాధించింది.

378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఏ జట్టుకు భారత పేసర్ యశ్ ఠాకూర్ పవర్‌ప్లేలోనే గట్టి షాకులు ఇచ్చాడు. డిక్వెల్లా, అవిష్క, నువానిందు వికెట్లను పడొగొట్టి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. సదీర సమరవిక్రమ, వన్యుజ సహన్ పోరాడినప్పటికీ, భారత బౌలర్ల ధాటికి లంక 311 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రజ్ నిగమ్ చెరో 3 వికెట్లతో అదరగొట్టగా, అనుకుల్ రాయ్ 2 వికెట్లు తీసి భారత్‌కు 66 పరుగుల ఘన విజయాన్ని అందించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola