Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
ఇండియా సౌథ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. బ్యాటింగ్ పరంగా ప్లేయర్స్ ఎవరు ఆశించిన స్థాయిలో రాణించలేక పొయ్యారు. బౌలింగ్ విభాగం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. దాంతో టీమ్ ఇండియా ఘోర పరాజయం పాలయింది. అయితే టీమ్ ఇండియా ఓటమిపై కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఓటమికి కారణాలను వెల్లడించాడు.
సూర్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ తన వల్లే ఇలా ఓడిపొయ్యామని చెప్పుకొచ్చాడు." పిచ్ కండిషన్స్‌ను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యాం. ప్లాన్-బీని అమలు చేయలేకపోయాం. టాస్ గెలిచిన మేము ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగుండేది. కానీ, బౌలింగ్ ఎంచుకున్నాం. ముందు బ్యాటింగ్ చేయడం వల్ల ఏ లెంగ్త్‌లలో బౌలింగ్ చేయాలనే విషయం సౌతాఫ్రికా బౌలర్లకు బాగా అర్ధమైంది. అయినా పర్వాలేదు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. సౌతాఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచి మేము పాఠం నేర్చుకున్నాం అని అన్నాడు.
అలాగే బ్యాటింగ్ లైన్ అప్ గురించి కూడా మాట్లాడాడు. "శుభ్‌మాన్ గిల్, నేను మంచి ఆరంభాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఇద్దరం పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యాం. అభిషేశ్ శర్మపై ఎప్పుడూ ఆధారపడలేం. నేను, గిల్, మా తరువాతి బ్యాటర్లు టీమ్ కు కావాల్సిన పరుగులు సాధించడంపై దృష్టిపెట్టాలి. కానీ, అలా జరగలేదు. వచ్చే మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శం ఇచ్చేందుకు రెడీ అవుతాం. గత మ్యాచ్ తరహాలో అక్షర్ పటేల్, హార్డిక్ రాణిస్తారని ఆశించాం. కానీ, దురదృష్టవశాత్తు అది జరగలేదు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.