Ind vs SA First Test Match Preview | సౌతాఫ్రికాతో నేటి నుంచి మొదటి టెస్ట్ లో తలపడనున్న భారత్

Continues below advertisement

 నేటి నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా టెస్ట్ సిరీస్ లో తలపడనుంది. రెండు టెస్టు మ్యాచుల ఈ సిరీస్ లో యంగ్ భారత్ పటిష్ఠమైన సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. వరల్డ్ ఛాంపియన్స్ గా నిలిచిన తర్వాత జోరు మీదున్న సఫారీలను ఈడెన్ లో తొలిటెస్టులో ఢీకొడుతున్న భారత్ క్వాలిటీ టీమ్ ముందు ఎలా నిలబడుతుందనేది ఆసక్తికరంగా ఉంది. ఇంగ్లండ్ లో ఇంగ్లండ్ ను సమర్థంగానే ఎదుర్కొన్న యువ భారత్ కు సొంత గడ్డపై ఇదే పెద్ద టెస్ట్ సిరీస్. స్పిన్నర్లకు సహకరించే భారత ఉపఖండపు పిచ్ లపై క్వాలిటీ బౌలింగ్ ను ఎదుర్కొని టీమిండియా ఎలా దూసుకువెళ్తుందనే విషయంపై గౌతం గంభీర్ సహా బీసీసీఐ సెలక్షన్ కమిటీ దృష్టి సారించనుంది. ఇక టీమ్ కూర్పు విషయమానికి వస్తే శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో జైశ్వాల్, రాహుల్ ఓపెనింగ్ చేస్తారు. ఇంగ్లండ్ సిరీస్ లో అంతగా రాణించలేకపోయిన సాయి సుదర్శన్ కి ఇంది మంచి ఆపర్చునిటీ ప్రూవ్ చేసుకోవటానికి... కెప్టెన్ గిల్, స్పెషలిస్ట్ బ్యాటర్ గా ధృవ్ జురెల్ ఎలా ఆడతారనే దానిపై చాలా ఈక్వేషన్స్ డిపెండ్ కానున్నాయి. అన్నింటికంటే క్రూషియల్ ఇంగ్లండ్ సిరీస్ లో గాయపడిన కీపర్ రిషభ్ పంత్ మళ్లీ ఈ మ్యాచ్ తో పునరాగమనం చేస్తున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ భారాన్ని జడ్డూ, కుల్దీప్, సుందర్ చూసుకుంటారు. జడ్డూ, సుందర్ వాళ్లదైన స్టైల్ లో బ్యాటింగ్ లో కీరోల్ పోషించాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది.  పేస్ దళాన్ని బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ నడిపిస్తారు. మనకు ధీటుగా సౌతాఫ్రికా కూడా స్పిన్నర్లతో కళకళలాడుతోంది. కేశవ్ మహారాజ్, సేనురాన్ ముత్తుస్వామి, సైమన్ హార్మర్ పాకిస్థాన్ తో సిరీస్ లో వికెట్ల జాతర చేశారు. వాళ్ల పేస్ బలం రబాడా, మార్కో యాన్సన్ ఎలాగూ ఉన్నారు. బవుమా కెప్టెన్సీలో, మార్క్ క్రమ్ ఎక్స్ పీరియన్స్ తో డెవాల్డ్ బ్రూయిస్ లాంటి యంగ్ స్టర్స్ భారత్ పిచ్ లపై ఎలా ఆడతారానేది కీలకం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola