Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్-19 ఫైనల్
క్రికెట్ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మ్యాచ్ నేడు జరగబోతుంది. అండర్ 19 ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయి. రికార్డు స్థాయిలో 12వ టైటిల్‌పై కన్నేసిన టీమ్‌ఇండియా.. మరోవైపు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న పాకిస్తాన్. దాంతో ఈ రెండు టీమ్స్ మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది.
ఇప్పటికే లీగ్ స్టేజ్ లో పాకిస్థాన్‌పై భారత్ ఏకంగా 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఫైనల్ లోను అదే జోరు కొనసాగించాలని చూస్తుంది. ఆయుష్ మ్హత్రే నేతృత్వంలో టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో దిగనుంది. ఈ టోర్నమెంట్ లో భారత్ గ్రూప్-A లో జరిగిన అన్ని మ్యాచ్‌లలోనూ విజయం సాధించింది.
సెమీఫైనల్‌లో శ్రీలంకను చిత్తుగా ఓడించి భారత్ ఫైనల్‌కు చేరగా, బంగ్లాదేశ్‌ను ఓడించి పాకిస్థాన్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ టోర్నమెంట్‌లో భారత జట్టు ఇప్పటికే రెండుసార్లు 400లకు పైగా పరుగులు సాధించింది. యువ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, వికెట్ కీపర్ అభిజ్ఞాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. పాకిస్థాన్ బౌలింగ్ బాగానే ఉన్నా బ్యాటింగ్ మాత్రం అంత ప్రభావం చూపకలేకపోతుంది. ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.