Ind vs Pak U19 World Cup | సెమీస్‌కు చేరిన భారత్
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో (U19 World Cup) లో టీమ్ ఇండియా దూసుకుపోతుంది. యంగ్ టీమ్ అద్భుతంగా అక్కటుకుంది. లీగ్ స్టేజ్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్‌పై 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా. ఈ విజయంతో సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ అయింది. 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను వేదాంత్ త్రివేది ( Vedant Trivedi ) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. మిగితా ప్లేయర్స్ కు రాణించడంతో భారత్ 252 స్కోరును సాధించింది.
253 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. 151/3 కోల్పోయి దూసుకుపోతుంది. భారత బౌలర్లు పుంజుకొని వరుసగా వికెట్స్ తీయడంతో పాక్ బ్యాట్స్మన్ పెవిలియన్ చేరక తప్పలేదు. కెప్టెన్ ఆయుష్ మాత్రే ( Ayush Mathre ), ఖిలాన్ పటేల్ ( Khilan Patel ) చెరో మూడు వికెట్లు తీసి పాక్ పతనానికి కారణం అయ్యారు. కేవలం 43 పరుగుల వ్యవధిలోనే పాకిస్థాన్ చివరి 8 వికెట్లను కోల్పోయి 194 పరుగులకే కుప్పకూలింది.