IND vs PAK Asia Cup 2025 | షేక్ హ్యాండ్ కాంట్రవర్సీలో పాక్‌కి షాకిచ్చిన ఐసీసీ

ఆసియా కప్ 2025 సీజన్లో భాగంగా ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ని చిత్తుగా ఓడించింది భారత్. అయితే మ్యాచ్ ముగిశాక పాక్ ఆటగాళ్లకు కెప్టెన్ సూర్య షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వచ్చేయడం పెద్ద కాంట్రవర్సీ అయిన విషయం తెలిసిందే. ఈ కాంట్రవర్సీపై ఏకంగా ఐసీసీకి కంప్లైంట్ చేసింది పాకిస్తాన్. అపోజిషన్ టీమ్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా ఎలా వెళ్తారు? ఇది ఐసీసీ రూల్స్‌కి వ్యతిరేకం? దీనికి అనుమతించినందుకుగానూ మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాఫ్ట్‌ని టోర్నీ నుంచి తీసేయండి. లేకపోతే మేం నెక్ట్స్ యూఏఈతో జరగబోయే మ్యాచ్ ఆడేది లేదు.. అంటూ ఐసీసీనే బెదిరించడానికి ట్రై చేసింది పాక్ మేనేజ్‌మెంట్. అయితే ఈ బెదిరింపులకి వెనక్కి తగ్గకుండా పాక్ జట్టుకు భారీ షాకిచ్చింది ఐసీసీ. ‘ఈ విషయంలో మ్యాచ్ రిఫరీకి ఏం సంబంధం? అసలు ప్లేయర్లు తప్పనిసరిగా షేక్‌హ్యాండ్ ఇవ్వాలని ఎంసీసీ మాన్యువల్‌లోనే లేదు. అలాంటప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం రూల్ బ్రేక్ చేసినట్లు ఎలా అవుతుంది?’ అని తెగేసి చెప్పిందట. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే పాక్ ప్లేయర్లకి టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడాన్ని ఐసీసీ కూడా సమర్థించిందన్నమాట. ఈ దెబ్బతో పాక్‌కి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. మరి ఐసీసీ సమాధానానికి నిరసనగా ముందు చెప్పినట్లే యూఏఈతో ఆడబోయే మ్యాచ్‌ని పాక్ బాయ్‌కాట్ చేస్తుందో లేదో చూడాలి. అయితే టోర్నీలో నిలబడాలంటే ఈ మ్యాచ్ ఆడటం, గెలవడం పాక్‌కి చాలా అవసరం. మరి అలాంటి మ్యాచ్‌ని బాయ్ కాట్ చేసేటంత బుద్ధి తక్కువ పనైతే పాక్ చేయకపోవచ్చు. కానీ అది పాకిస్తాన్ కదా? ఏమైనా చేయొచ్చు.
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola