Ind vs NZ Suryakumar Yadav | టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడిన సూర్య

Continues below advertisement

న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా ఘనంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో 48 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 బ్యాటర్లు, ముగ్గురు స్ట్రైక్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఇక ఈ కాంబినేషన్స్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav). ముందు కూడా ఇదే కొనసాగిస్తామని తెలిపాడు. 

'ఈ మ్యాచ్‌లో మేం బ్యాటింగ్ చేసిన తీరు బాగుంది. పవర్ ప్లేలో 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడికి గురైన తర్వాత కూడా గేమ్ ను  15వ ఓవర్ వరకు నిలకడగా తీసుకెళ్లాం. ఆ తర్వాత మా బ్యాటర్లందరూ తమ జోరును ఏ మాత్రం తగ్గించలేదు.

8 మంది బ్యాటర్లు ముగ్గురు స్ట్రైక్ బౌలర్ల కాంబినేషన్ బాగుంది. ఒక టీమ్ గా మాకు ఈ స్ట్రాటజీ బాగా పనిచేస్తోంది. ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది కాబట్టి దీనినే కొనసాగిద్దాం. ఈ రోజు తీవ్ర ఒత్తిడి‌లో ఆడాల్సి వచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నేను చాలా సార్లు ఆడాను. నేను ముందుగా చెప్పినట్లుగా నెట్స్‌లో బాగా ఆడుతున్నాను. గత 2-3 వారాలుగా నా షాట్లను నెట్స్‌లో బాగా ప్రాక్టీస్ చేశాను. నెట్ సెషన్స్‌లో, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో ఇలానే ఆడాను. ఈ మ్యాచ్‌లోనూ అలానే ఆడటంతో సంతోషంగా ఉంది అంటూ తన పర్ఫార్మెన్స్ గురించి కూడా ప్రస్తావించాడు. అలాగే ఫీల్డింగ్ మెరుగవ్వాలని అన్నాడు. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతీసారి ఇంకా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం అని తెలిపాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola