IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!

Continues below advertisement

న్యూజిలాండ్ పర్యటనను గెలుపుతో ఘనంగా ప్రారంభించిన టీమిండియా, మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరగనున్న రెండో టీ20లో న్యూజిలాండ్‌తో భారత జట్టు తలపడనుంది. తొలి టీ20లో 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన భారత్, అదే జోరును కొనసాగించి సిరీస్‌లో 2-0 ఆధిక్యం సాధించాలని పట్టుదలతో ఉంది.

అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గజ్జలో గాయం కారణంగా ఈ రెండో టీ20కి దూరమయ్యాడు. తొలి మ్యాచ్‌లోనే ఈ గాయంతో బాధపడిన ఇషాన్, తన రెగ్యులర్ బ్యాటింగ్ స్థానంలో రాకుండా ఆలస్యంగా క్రీజులోకి వచ్చాడు. ఇప్పుడు ఇషాన్ గైర్హాజరీతో భారత ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్‌లో మార్పులు తప్పనిసరిగా మారాయి.

ఇషాన్ వైదొలగడంతో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి తుది జట్టులో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. వైభవ్ వస్తే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది, అప్పుడు ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చడం ఇష్టం లేకపోతే మాత్రం శివమ్ దూబేను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల జట్టుకు అదనపు ఆల్‌రౌండర్ లేదా బౌలింగ్ ఆప్షన్ కూడా లభిస్తుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola