Ind vs Nam T20WC Sanju Samson | సంజూ గోల్డెన్ చాన్స్ మిస్

Continues below advertisement

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ( Sanju Samson ) మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో, ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) అనారోగ్యం కారణంగా సంజూకు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో తన స్థానాన్ని సెట్ చేసుకునేందుకు లభించిన ఈ గోల్డెన్ చాన్స్ ను సంజూ వేస్ట్ చేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజూ.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 8 బంతుల్లోనే 1 ఫోర్, 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి 275 స్ట్రైక్ రేట్‌తో విధ్వంసం సృష్టించాడు. కానీ, క్రీజులో సెట్ అయిన తర్వాత అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌ లో సంజూ భారీ స్కోర్ చేసి ఉంటె ఓపెనింగ్ రేసులో తన ముద్ర వేసేవాడు.

సంజూ ఇలా మరోసారి విఫలమవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. గోల్డెన్ ఛాన్స్‌ను మిస్ చేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతున్నందున, ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ లో సంజూకే మరో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఈ విషయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) కూడా హింట్ ఇచ్చాడు. మరి సంజూ ప్లేయింగ్ 11 లో ఉంటాడో లేదో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola