Ind vs Nam T20 World Cup Jasprit Bumrah Catch | బుమ్రా కళ్లు చెదిరే క్యాచ్

Continues below advertisement

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) బౌలింగ్‌తోనే కాదు, ఫీల్డింగ్‌తోనూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా ఒక సూపర్ క్యాచ్ పట్టాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. బంతి గాలిలోకి లేచిన 4.7 సెకన్ల వ్యవధిలోనే స్పందించి, అద్భుతమైన డైవ్‌తో బాల్ అందుకున్నాడు. 

13వ ఓవర్‌లో అక్షర్ పటేల్ ( Axar Patel ) వేసిన బాల్ ను నమీబియా బ్యాటర్ మలాన్ క్రుగర్ ( Malan Kruger ) స్వీప్ షాట్‌కు ప్రయత్నించాడు. కానీ బాల్ బ్యాట్ ఎడ్జ్ కి తగిలింది. ఫైన్ లెగ్ దిశగా గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా, తన ఎడమ వైపునకు పరుగెత్తుకుంటూ వెళ్లి గాలిలో తేలుతూ క్యాచ్ పట్టాడు. 

బుమ్రా క్యాచ్ పట్టగానే ఫీల్డింగ్ చేస్తున్న ప్లేయర్స్ తోపాటు స్టేడియం మొతం షాక్ అయింది. అక్సర్ పటేల్ రియాక్షన్ మాత్రం ఫుల్ గా వైరల్ అవుతుంది. డగౌట్‌లో ఉన్న కోచింగ్ స్టాఫ్ కూడా ఆశ్చర్యపోయారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) కూడా బుమ్రా ఫీల్డింగ్ చూసి నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola