Ind vs Eng Highlights Day 4 | ఇంగ్లాండ్ కు 371 టార్గెట్ సరిపోతుందా?

హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న ఇండియా ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇక ఒకే రోజు ఆట మిగిలి ఉండడంతో మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నది ఫ్యాన్స్ అంచన వేయలేకపోతున్నారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ ముందు టీం ఇండియా 400 పరుగుల టార్గెట్ సెట్ చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో 364 ప‌రుగుల‌కు అల్అవుట్ అయ్యారు. ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండ్ 371 ప‌రుగులు చేయాలి. 

నాలుగో రోజు ఆట ముగిసే టైంకి ఇంగ్లండ్ 6 ఓవర్లలో 21 పరుగులు చేసింది. ఓపెనర్స్ బెన్ డకెట్, జాక్ క్రాలీ క్రిజ్ లో ఉన్నారు. ఐదో రోజు 350 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఇక భారమంతా బౌలర్లపైనే ఉంది. గెలవాలంటే బుమ్రాకి తోడుగా ప్రసిద్ధ్, సిరాజ్ లు మంచి ప్రదర్శన కనబర్చాలి. బౌలర్లు, వికెట్ కీపర్, ఫిల్డర్స్.. ఇలా అందరు గట్టిగ డిఫెండ్ చేయాలి. ఎలాంటి పొరపాటు చేయకుండా ఇంగ్లాండ్ ని కట్టడి చేయగలిగితే ఈ మ్యాచ్‌లో శుబ్మన్ గిల్ సేన గెలవడం ఖాయం అని అంటున్నారు ఫ్యాన్స్.

ఈ మ్యాచ్ లో ఇండియా ఇంగ్లాండ్ కి ఇచ్చిన టార్గెట్ లో ఆసక్తికరంగా మారిన అంశం ఏంటంటే... 2022లో బర్మింగ్‌హాంలో జరిగిన మ్యాచులో 378 పరుగల టార్గెట్‌ను ఇంగ్లండ్ టీం ఛేజ్ చేసింది. అది ఒక రికార్డు బ్రేకింగ్ రన్ చేస్ అనే చెప్పాలి. మరి అలాంటి టీం ముందు 371 టార్గెట్ సరిపోతుందా? అనేదే అందరి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఇండియా గెలవడమే అని అంటున్నారు ఫ్యాన్స్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola