IND Vs AFG Match Rain Chances | భారత్, ఆఫ్ఘన్ మ్యాచ్ రద్దయితే ఏం అవుతుంది?

Continues below advertisement

సూపర్-8లో తన మొదటి మ్యాచ్‌లో భారత్, ఆప్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ బ్రిడ్జ్ టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరగనుంది. ఇక్కడ వాతావరణ పరిస్థితులు ప్రస్తుతానికి ఆశాజనకంగా లేవని తెలుస్తోంది. అక్కడ వెదర్ అంతా కొద్ది రోజుల పాటు క్లౌడీగా ఉండనుంది. అలాగే గురు, శుక్రవారాల్లో భారీ వర్షం కూడా పడే అవకాశం ఉందట. ఈ వరల్డ్ కప్‌లో ఎన్నో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. మరి ఒకవేళ సూపర్-8లో మ్యాచ్‌లు రద్దయితే ఏం జరుగుతుంది?

ఒకవేళ భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరగనున్న సూపర్-8 మ్యాచ్ రద్దయితే గ్రూప్ దశ తరహాలోనే రెండు జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఒక పాయింట్ ఒక జట్టుకు వరం కాగా, అదే ఒక పాయింట్ మరో జట్టుకు శాపంగా మారే అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే గ్రూప్ దశలో ఇంగ్లండ్, స్కాట్లాండ్ జట్ల జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అప్పుడు రెండు జట్లకూ చెరో పాయింట్ లభించింది. దీంతో ఇంగ్లండ్ సూపర్-8కు రావడానికి నానా తిప్పలూ పడాల్సి వచ్చింది. చివరికి ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మ్యాచ్ రిజల్ట్ మీద ఆధారపడాల్సి వచ్చింది. భారత్‌కు అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మ్యాచ్ జరగాల్సిందే.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram