IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు తొలిరోజే అఫ్గాన్ బౌలర్లను ఆడుకుంటూ రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో భారీ స్కోరు వైపు దూసుకెళ్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ మొదటి రోజు ఆట ముగిసేసరికి 85 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 368 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అయితే భారత్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 24 పరుగులు అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్, ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఐపీఎల్ జోరును కొనసాగిస్తూ వీరిద్దరూ రెండో వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

సుదర్శన్ 81 పరుగులు చేసి అవుట్ కాగా, కేఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో తన కెరీర్‌లో 12వ టెస్ట్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. శుభ్‌మన్ గిల్ ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ 143 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 103 పరుగులు చేసి కెరీర్‌లో 11వ సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. అతనికి తోడుగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కూడా ధాటిగా ఆడుతూ 50 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola