Shreyas in place of Tilak Ind vs NZ | తిలక్ స్థానంలో శ్రేయస్
టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతుండగా గాయపడ్డాడు. దాంతో తిలక్ న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. తొలి మూడు టీ20లకు తిలక్ వర్మ అందుబాటులో ఉండడని బీసీసీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. గాయం నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్ సాధిస్తే మిగతా రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు తిలక్ స్థానంలో ఎవరు టీమ్ లోకి వస్తారన్న చర్చ మొదలయింది. శుభ్‌మన్ గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ రేసులో ఉన్నారు. అయితే ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక సూచనలు చేసారు.
టీమిండియాకు మూడు, నాలుగో స్థానంలో ఆడగలిగే మిడిలార్డర్ బ్యాటర్ అవసరం ఉందని, మరో ఓపెనర్ అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 'భారత జట్టుకు ఓ కొత్త ప్లేయర్ కావాలి. అది శుభ్‌మన్ గిల్? అంటే కాదు. అతని అవసరం టీమ్ కు లేదు. యశస్వి జైస్వాల్ కూడా వద్దు. టీమిండియాకు మరో ఓపెనర్ అవసరం లేదు. అలాంటి ప్లేయర్ ఎవరు లేకపోతే టీమిండియా ముందున్న ఏకైక ఆప్షన్ శ్రేయస్ అయ్యర్. అతన్ని నేరుగా ఎంపిక చేయాలి అని అన్నారు ఆకాష్ చోప్రా.