Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్

Continues below advertisement

ఇండియా క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన కోచింగ్ స్టైల్ వల్ల కేవలం ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచం నుంచి ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు. హెడ్ కోచ్ గా గంభీర్ భాద్యతలు తీసుకున్నప్పటి నుంచి టీమ్ సెలక్షన్, మార్పులకు సంబంధించి ఫ్యాన్స్ మండిపడుతూనే ఉన్నారు. వారితోపాటే కొంతమంది క్రికెట్ విశ్లేషకులు, మాజీ ప్లేయర్స్ కూడా టీమ్ ఇండియా ప్రదర్శనపై విమర్శలు చేస్తున్నారు. అయితే గంభీర్ కోచింగ్ పై ఐస్‌లాండ్ క్రికెట్ తీవ్ర విమర్శలు చేసింది. 

" మా అభిమానులందరికీ చెప్తున్నాం.. గౌతమ్ గంభీర్‌ని మా కొత్త నేషనల్ టీమ్ కోచ్‌గా ఆహ్వానించడం లేదు. ఆ స్థానం ఇప్పటికే భర్తీ చేయబడింది. మేము 2025లో ఆడిన మ్యాచులో 75% గెలిచాము " అంటూ ఐస్‌లాండ్ క్రికెట్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్ ఒక సరిగా వైరల్ అయింది. ఈ పోస్ట్ పై ఫ్యాన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. 

ప్రపంచంలోనే పవర్ ఫుల్ టీమ్ గా పేరు తెచ్చుకున్న ఇండియా క్రికెట్ టీమ్ కోచ్ ను ఐస్‌లాండ్ క్రికెట్ బోర్డు ఇలా బహిరంగంగా ఎగతాళి చేసింది. అంటే టెస్ట్ క్రికెట్‌లో కోచ్ గా గంభీర్ స్థానం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది అని ఫ్యాన్స్ అంటున్నారు. 

జులై 2024 లో టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా భాద్యతలు చేపట్టారు గంభీర్. అతని కోచింగ్‌లో భారత్ 12 ఏళ్లలో మొదటిసారిగా సొంతగడ్డపై న్యూజిలాండ్‌ తో వైట్‌వాష్‌ కు గురయింది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో ఓడిపోయింది. సౌతాఫ్రికా సిరీస్‌ లో అదే పరిస్థితి. ముందు జరగబోయే మ్యాచులను గెలిచి మంది ఫలితాలు తీసుకురావమే గంభీర్ ఈ ట్రోల్స్ కు చెప్పే సమాధానం అవుతుంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola