నేటి నుంచి మహిళల వన్డే వరల్డ్ కప్.. 47 ఏళ్ల భారత నిరీక్షణ తీరేనా?

టీమ్ ఇండియా మేన్స్ టీమ్ ఆసియాకప్‌ గెలవడంతో సంబరాల్లో మునిగి తేలుతుంది. ఇక ఇప్పుడు అమ్మాయిల వంతు వచ్చేసింది. నేటి నుంచి 13వ మహిళల వన్డే వరల్డ్‌ కప్ మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి 12 ఏళ్ల తర్వాత ఇండియా ఆతిధ్యం ఇస్తుంది. శ్రీలంకతో హర్మన్‌ప్రీత్‌ బృందం తలపడనుంది. గత 47 ఏళ్లుగా భారత్ ఈ కప్ కోసం ఎదురు చూస్తుంది. 1978లో మొదటి వరల్డ్‌కప్‌ జరిగింది. టీమ్ ఇండియా 2005, 2017 లో రన్నర్అప్ గా నిలిచింది. 2022లో జరిగిన వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. 

వన్డే, టీ20ల్లో ఇంగ్లండ్‌పై గెలిచిన మహిళల జట్టు ఈ టోర్నమెంట్ లో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన మంచి ఫార్మ్ లో ఉండడం టీమ్ కు చాలా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఆడిన 14 వన్డేల్లో 928 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకున్న జెమీమా ఇంగ్లండ్‌తో వామప్‌ మ్యాచ్‌లో అర్ధసెంచరీ సాధించింది. అలాగే హర్లీన్‌, రిచా, దీప్తిలతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ పటిష్టంగానే ఉంది. పేస్‌ విభాగం కాస్త బలహీనంగా ఉందనే చెప్పాలి. అయితే ఇండియా పిచ్‌లపై తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి, రాధా యాదవ్‌, స్నేహ్‌ రాణాల స్పిన్‌ తో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎలాగైనా కప్ గెలవాలని కసిగా ఉన్న మహిళల జట్టు ఎలా ప్రదర్శిస్తుందో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola