ICC Shocking Decision against PCB | ద్వైపాక్షిక సిరీస్‌లు కావాలని ఐసీసీని కోరిన పాక్ | ABP Desam

టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ పై ఉత్కంఠ వీడింది. అందుకున్న డేట్ ప్రకారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board )కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( International Cricket Council ) గట్టి షాక్ ఇచ్చింది. 

పీసీబీ చేసిన ప్రధాన డిమాండ్లలో భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్ పునరుద్ధరణ, భారత్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ త్రైపాక్షిక సిరీస్ నిర్వహణ ఉన్నాయి. అయితే ఇవి తమ పరిధిలోకి రావని ఐసీసీ స్పష్టం చేసింది. ద్వైపాక్షిక సిరీస్‌లపై నిర్ణయం పూర్తిగా బీసీసీఐ పరిధిలోనే ఉంటుందని పేర్కొంది. అలాగే బంగ్లాదేశ్‌కు ( Bangladesh ) పూర్తి రెవెన్యూ ఇవ్వడం, వారికి భవిష్యత్ ఐసీసీ టోర్నమెంట్ కేటాయించడం వంటి అంశాలపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

పీసీబీ తుది నిర్ణయం కోసం ఒక్క రోజు సమయం ఇచ్చింది ఐసీసీ. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో చర్చించి, తమ నిర్ణయాన్ని తెలపాలని నఖ్వీని ఐసీసీ ఆదేశించింది. ఒకవేళ పాక్ వెనక్కి తగ్గకపోతే, ఐసీసీ నుంచి ఆ దేశంపై కఠిన చర్యలు ఉండే అవకాశం ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola