ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు

క్రికెట్ మైదానంలో మరోసారి క్రీడాస్ఫూర్తిపై పెద్ద చర్చ మొదలైంది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ వైస్ కెప్టెన్ రనౌట్ అయిన తీరు ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, అఘాకు డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది. 

అసలేం జరిగిందంటే.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న సల్మాన్ అఘా, బ్యాటర్ ఆడిన బంతి తన బ్యాట్‌కు తగలడంతో దానిని అందుకుని బౌలర్‌కు అందించే ప్రయత్నం చేశాడు. అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్, ఆ బంతిని అందుకుని వెంటనే వికెట్లకు తాకించి రనౌట్ అప్పీల్ చేశాడు. అంపైర్ దానిని అవుట్‌గా ప్రకటించడంతో సల్మాన్ అఘా షాక్‌కు గురయ్యాడు. 

మైదానం వీడుతున్న సమయంలో కోపంతో తన గ్లోవ్స్, బ్యాట్‌ను నేలకు కొట్టినందుకు ఐసీసీ లెవల్-1 నేరం కింద ఒక డీమెరిట్ పాయింట్ విధించింది. క్రికెట్ పరికరాలను అగౌరవపరిచినందుకు ఈ చర్య తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola