Hombale Films to Buy RCB ? | RCB ఓనర్లుగా హోంబలే ఫిల్మ్స్ ?

Continues below advertisement

ప్రముఖ కన్నడ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ ఇప్పుడు ఐపీఎల్ లోకి అడుగుపెట్టబోతుందట. IPL 2025 టైటిల్ విన్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును హోంబలే ఫిల్మ్స్ కొనుగోలు చేస్తునట్టు తెలుస్తుంది. ప్రస్తుత ఆర్‌సీబీ యాజమాన్య సంస్థ RCB ని అమ్మకానికి పెట్టింది. దాంతో ఎన్నో కంపెనీస్ RCB ని కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఈ పోటీలో కన్నడ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ హోంబలే ఫిల్మ్స్ కూడా చేరింది. 

2012లో స్థాపించబడిన ‘హోంబలే ఫిల్మ్స్’ కన్నడలో చిన్న సినిమాలు తెరకెక్కిస్తూనే.. పాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. 'కే.జీ.ఎఫ్’, ‘కాంతార’, ‘సలార్’ రీసెంట్ గా వచ్చిన ‘మహావతార్ నరసింహా’ .. ఇలా ప్రతి సినిమాతో  సక్సెస్ అందుకున్న ఈ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఆర్సీబీని కొనాలంటే 17 వేల కోట్ల ఖర్చు ఉంటుందని విశ్లేషకుల అంచనా. మరి హోంబలే ఫిల్మ్స్ అంత ఖర్చు పెట్టి  ఆర్సీబీని కొంటుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం సొంత రాష్ట్ర ఓనర్ల చేతిలోకె వెళ్తుంది ఆర్సీబీ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola