Harry Brook in England vs New Zealand | న్యూజిలాండ్‌తో వన్డేలో హ్యారీ బ్రూక్ సెంచరీ
న్యూజిలాండ్‌లో జరిగిన మొదటి వన్డేలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. కేవలం పది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టీమ్ కు చెప్పుకోదగ్గ స్కోర్ అందించి పరువు కాపాడాడు. టీమ్ మొత్తం 223 పరుగులు చేస్తే.. బ్రూక్ ఒక్కడే 135 పరుగులు చేసాడు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ... ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చింది. న్యూజిలాండ్ పేస్ కు ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ విలవిల్లాడింది. జెమీ స్మిత్, బెన్ డకెట్, జో రూట్, జాకబ్ బేతెల్ వెంటవెంటనే వికెట్లను సమర్పించుకున్నారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు కెప్టెన్ బ్రూక్.
బ్రూక్, ఓవర్టన్ కలిసి 181 పరుగులు చేస్తే మిగతా 9 మంది బ్యాటర్లు 42 పరుగులు చేశారు. హ్యారీ బ్రూక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరో వైపు సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. హ్యాట్రిక్ సిక్సర్లు బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ 101 బంతుల్లో 135 పరుగులు చేశాడు. న్యూజీలాండ్ మ్యాచ్ గెలిచినప్పటికీ కూడా బ్రూక్ అందరి ప్రసంశలు అందుకుంటున్నాడు.