వేస్ట్ కెప్టెన్ పీకేయాలి అన్నారు.. అవసరమైన చోట అదరగొట్టేసింది..!

Continues below advertisement

సరిగ్గా మూడు మ్యాచ్‌ల ముందు.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు.. కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్‌ని ఇండియన్ ఫ్యాన్స్‌లో చాలామంది విపరీతంగా ట్రోల్ చేశారు. ‘అసలు హర్మన్ కెప్టెన్సీ చెత్తగా ఉందని.. బ్యాటింగ్ రాదు, ఫీల్డింగ్ సెట్ చేయడం రాదు, బౌలింగ్ మార్పులు చేయడం రాదు.. ఇలాంటి వేస్ట్ కెప్టెన్ ఇండియాకి అవసరమే లేదు. వెంటనే పీకేయండి’ అంటూ సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయినే నడిపారు.

అదే టైంలో వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో హర్మన్ అటు బ్యాటింగ్‌లో వరుసగా ఫెయిల్ కావడమే కాకుండా.. కెప్టెన్‌గా తీసుకునే నిర్ణయాల్లోనూ ఎదురుదెబ్బలు తగలడంతో ఇక హర్మన్ చాప్టర్ క్లోజ్ అయిపోయిందనుకున్నారంతా. కానీ కట్ చేస్తే.. విమెన్స్ వన్డే వరల్డ్ కప్‌ 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించడంలో కీ రోల్ పోషించి.. అటు కెప్టెన్‌గానూ, ఇటు బ్యాటర్‌గానూ బ్లాక్‌ బస్టర్ సక్సెస్ అయింది హర్మన్.

ఒకపక్క జెమీమా రోడ్రిగస్ 127 రన్స్‌తో ఆఖరి వరకు నాటౌట్‌గా ఉండి.. తిరుగులేని సెంచరీతో చెలరేగితే.. మరోపక్క హర్మన్ 89 పరుగుల క్రూషియల్ కెప్టెన్ నాక్ ఆడటంతో 338 పరుగుల భారీ టార్గెట్‌ని టీమిండియా 5 వికెట్ల తేడాతో మరో 9 బంతులు మిగిలుండగానే ఛేజ్ చేసి.. చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఆదివారం సౌతాఫ్రికాతో ఫైనల్లో తలపడుంది. మరి ఆ మ్యాచ్‌లో కూడా భారత్ గెలిస్తే.. హర్మన్ పేరు ఇండియన్ విమెన్స్ క్రికెట్లో నిజంగానే సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ పేరవుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola