టెన్షన్‌లో టీమిండియా న్యూజిల్యాండ్‌పై గెలిచినా..
హ్యాట్రిక్ ఓటములతో సెమీస్ ఆశలని దాదాపు పోగొట్టుకున్న టీమిండియా అమ్మాయిలు ఎట్టకేలకు న్యూజిల్యాండ్ మీద సూపర్ విక్టరీ సాధించి గ్రాండ్‌గా సెమీస్‌లో అడుగుపెట్టారు. 109 రన్స్‌తో స్మృతి మంధాన, 122 రన్స్‌తో ప్రతికా రావల్ హిస్టారికల్ బ్యాటింగ్‌తో న్యూజిల్యాండ్ బౌలర్లని ఉతికారేయడంతో టీమిండియా ఏకంగా 53 రన్స్ తేడాతో అద్భుత విజయం దక్కించుకుని సెమీస్ చేరుకుంది.
అయితే ఈ గెలుపుతో సెమీస్‌లో అడుగుపెట్టామనే ఆనందం కంటే.. టీమ్ బౌలింగ్ చాలా వీక్‌గా మారడం కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు ఇండియన్ టీమ్ ఫ్యాన్స్‌ని కూడా టెన్షన్ పెడుతోంది.ఈ విషయాన్ని హర్మన్ కూడా ఒప్పుకుంది. మా బ్యాటర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా వరుస ఓటముల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తీరు.. స్మృతి, ప్రతిక సూపర్ సెంచరీలతో ఇచ్చిన ఓపెనింగ్.. చాలా ఆనందాన్నిచ్చింది.
ప్రెజర్‌ని తట్టుకుంటూ వాళ్లు ఆడిన ఆటని కచ్చితంగా అప్రీషియేట్ చేయాల్సిందే. కానీ మేం బ్యాటింగ్‌లో బాగా ఆడినా.. బౌలింగ్ విషయంలో బలంగా లేమనిపిస్తోంది. అందుకే సెమీస్‌లో బౌలింగ్ పరంగా కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అని హర్మన్‌ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే.. న్యూజిల్యాండ్‌ని ఓడించి సెమీస్ చేరిన టీమిండియా.. అక్కడ ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికాతో తలపడే అవకాశాలున్నాయి. ఈ రోజు శనివారం ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుండగా.. గెలిచిన జట్టు పాయింట్స్ టేబుల్లో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో భారత్‌తో తలపడుతుంది.