Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
ముంబై ఇండియన్స్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు గుడ్‌బై చెప్పేయడానికి సిద్ధమయ్యాడు అంట. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే తాను ఈ టీమ్ లో కొనసాగలేనని ఫ్రాంచైజీ ఓనర్స్‌కు హార్దిక్ స్పష్టం చేసినట్లుగా ఒక వార్త వైరల్ అవుతుంది.
తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక అలసట, మరియు వెన్నునొప్పి కారణాల వల్లే హార్దిక్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024లో రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వచ్చినప్పటి నుంచి హార్దిక్‌కు సొంత అభిమానుల నుంచే తీవ్రమైన ట్రోల్స్, అవమానాలు ఎదురయ్యాయి. ఇక తాజా ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు మాత్రమే నమోదు చేసి ప్లే ఆఫ్స్ రేస్ నుండి నిష్క్రమించింది.
జట్టు వైఫల్యానికి అంతా కెప్టెన్‌నే బ్లేమ్ చేయడంతో, ఇక ఈ టీమ్‌లో కొనసాగే మానసిక శక్తి హార్దిక్‌కు లేదని అంటున్నారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్లేయర్ ట్రేడింగ్ విండో ద్వారా వచ్చే సీజన్ కోసం హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఆగస్టు నాటికి పూర్తి స్పష్టత రానుంది. మరి హార్దిక్ ముంబై టీమ్ లోనే కొనసాగుతాడా లేదా అన్నది చూడాలి.