Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?
భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గత కొన్నేళ్లుగా కేవలం టీ20, ODI ఫార్మాట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. వెన్ను గాయం కారణంగా టెస్ట్ ఫార్మాట్‌కు దూరంగా ఉంటున్న పాండ్యా.. మళ్ళీ టెస్టు క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ తో నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో హార్దిక్ టెస్ట్ మ్యాచ్ లో ఆడడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
హార్దిక్ నేరుగా టెస్టుల్లోకి రాకుండా, ముందుగా దేశవాళీ క్రికెట్ లేదా ఇండియా-ఏ తరఫున కొన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉందట. ఐదు రోజుల పాటు బౌలింగ్ చేసేంత ఫిట్‌నెస్ హార్దిక్ కు ఉందా లేదా అన్నది బీసీసీఐ చూడనుంది. అందుకే ముందు దేశవాళీ మ్యాచ్ ఆడమని మేనేజ్‌మెంట్ సూచించినట్లుగా తెలుస్తుంది. హార్దిక్ గనుక టెస్టుల్లోకి తిరిగి వస్తే, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మెరుగవుతుంది.