Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?

 ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ ఉన్న వివాదాలు తగ్గడం లేదు. ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలతో పాయింట్స్ టేబుల్ లో 9వ స్థానానికి పడిపోయి ఘోరంగా నిరాశపరిచింది. ఒకవైపు గాయాలు, మరోవైపు ఫామ్‌ లేక తో హార్దిక్ తీవ్రంగా సతమతమయ్యాడు. ఇది ఇలాగుండగా హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది.

హార్దిక్ తన ఇన్‌స్టా స్టోరీలో ఒక లాప్‌టాప్, నోట్‌బుక్ ఉన్న ఫోటోను షేర్ చేసాడు. అయితే అందులోని మొబైల్ స్క్రీన్‌పై టైం కరెక్ట్‌గా 07:07 అని చూపిస్తోంది. ఈ నంబర్ చూడటమే ఆలస్యం.. నెటిజన్లు దీనికి లెజెండ్ ఎంఎస్ ధోనీ జెర్సీ నంబర్ 7 తో లింక్ పెట్టి తలా ఫర్ ఏ రీజన్ అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. వచ్చే సీజన్‌లో హార్దిక్ ముంబైని వీడి, ధోనీ మెంటార్‌గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ లోకి మారబోతున్నాడనే హింట్ ఇవ్వడానికే ఈ పోస్ట్ పెట్టాడంటూ సోషల్ మీడియాలో చర్చలు జోరందుకున్నాయి. 

మరోవైపు హార్దిక్ భవిష్యత్తుపై ముంబై బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ స్పందించాడు. "ఎక్కడ తప్పు జరిగిందో ప్రశాంతంగా ఆలోచించడానికి మేనేజ్‌మెంట్‌కు కొంత సమయం కావాలి. అంతేకానీ ఇప్పుడే హడావిడిగా హార్దిక్ భవిష్యత్తు గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు" అని పొలార్డ్ స్పష్టం చేశాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola