Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్

Continues below advertisement

టీమ్ ఇండియాలో ఇప్పుడు స్ప్లిట్ కోచింగ్ అనేది హాట్ టాపిక్ గా మారింది. వైట్ బాల్, రెడ్ బాల్ ఫార్మాట్లకు వేరే కోచ్‌లు అవసరమనే విషయంపై చర్చ కొనసాగుతుంది. స్ప్లిట్ కోచింగ్ విషయంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇస్తున్నారు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అలాగే కాస్త సహనం ఉండాలని బీసీసీఐను హెచ్చరిస్తున్నారు. 

న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా టీమ్స్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా హోమ్ గ్రౌండ్ లోనే ఓటమి చవిచూసింది. ఆలా గంభీర్‌పై విమర్శలు పెరిగాయి. మరీ ముఖ్యంగా రెడ్ బాల్ క్రికెట్‌లో విఫలమవడంతో ఇండియన్ క్రికెట్ టీమ్ కు స్ప్లిట్ కోచింగ్ అవసరం అంటూ కొంతమంది క్రికెట్ నిపుణులు చెప్పుకొచ్చారు. కానీ హర్భజన్ సింగ్ మాత్రం ఈ విషయంలో గంభీర్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు. 

టీమ్ ఇండియా కోచ్‌గా ఉండటం అంత ఈజీ కాదు. ఏడాది పొడవునా టీమ్  ట్రావెల్ చేయాలి, సెలెక్షన్లపై దృష్టి పెట్టాలి, ప్రతి మ్యాచ్ ఫలితానికి బాధ్యత వహించాలి. కోచ్ ఎప్పుడూ గేమ్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉండాలి” అని హర్భజన్ సింగ్ అన్నాడు. స్ప్లిట్ కోచింగ్ విధానం ప్రస్తుతం అవసరం లేదని హర్భజన్ అభిప్రాయ పడుతున్నారు. “ఇప్పుడే కోచింగ్‌ను విడగొట్టాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టాలి. భవిష్యత్తులో అవసరం అనిపిస్తే అప్పుడు చేయొచ్చు. కానీ ఇప్పుడే కాదు” అని స్పష్టం చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola