Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు

Continues below advertisement

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా యంగ్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ నిరాశపరిచాడు. కెరీర్‌లో కేవలం ఆరో వన్డే మాత్రమే ఆడుతున్న గుర్నూర్, ఈ మ్యాచ్‌లో ఏకంగా 10 ఓవర్లలో 9.70 ఎకానమీతో 97 పరుగులు సమర్పించుకున్నాడు. 

కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన గుర్నూర్, భారత్ తరఫున ఒకే వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన మూడో బౌలర్‌గా నిలిచాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కి దూరం కావడంతో భారత బౌలింగ్ విభాగం తీవ్రంగా తడబడింది.

 బుమ్రా లేని లోటును స్పష్టంగా వాడుకున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు, ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో పరుగుల వరద పారించి భారీ స్కోరు సాధించారు. భారత్ తరఫున ఒకే వన్డేలో అత్యధిక పరుగులు ఇచ్చి అగ్రస్థానంలో ఉన్న అన్-వాంటెడ్ రికార్డు స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉంది. 2015లో ముంబై వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భువీ 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు గుర్నూర్ బ్రార్ 97 పరుగులతో ఈ జాబితాలో మూడో స్థానానికి చేరాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola