Gujarat vs Delhi Capitals WPL 2026 | ప్లేఆఫ్స్‌లోకి గుజరాత్‌

Continues below advertisement

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ ( Women's Premier League )లో జరుగుతున్న మ్యాచులు రోజు రోజుకి ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌ ( Delhi Capitals ), గుజరాత్‌ జెయింట్స్‌ ( Gujarat Giants ) మధ్య జరిగిన మ్యాచ్ లో ఫ్యాన్స్ కు చుక్కలు చూపించారు ప్లేయర్స్. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ 3 పరుగుల తేడాతో ఢిల్లీపై అద్భుత విజయాన్ని సాధించింది.

ఈ గెలుపుతో గుజరాత్‌ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. 175 పరుగుల లక్ష్యఛేదన కోసం బరిలోకి దిగిన ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చేజింగ్ మొదలు పెట్టినప్పటి నుంచే స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తూ ఢిల్లీ క్యాప్టిల్స్ ప్లేయర్స్ జోరు మీద ఉన్నారు. నిఖిప్రసాద్‌ ( Nikhi Prasad ), స్నేహ్‌ రానా ( Sneh Rana ) వరుసగా బౌండరీలు కొడుతూ అలరించారు. 

ఆఖరి ఓవర్‌లో ఢిల్లీ గెలవడానికి 9 పరుగులు మాత్రమే అవసరం. అప్పుడు బౌలింగ్‌కు దిగిన సోఫీ డివైన్‌ ( Sophie Devine ) చివరి మూడు బంతుల్లో  రెండు వికెట్లను పడగొట్టింది. నిఖిప్రసాద్‌, స్నేహ్‌ రానా వెంటవెంటనే అవుట్ అవడంతో గుజరాత్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ లో సోఫీ డివైన్‌ 4 కీలక వికెట్లను పడగొట్టింది. ఢిల్లీ క్యాప్టిల్స్ తరపున ఆడిన తెలుగు అమ్మాయి శ్రీచరణి 4 నాలుగు వికెట్లు తీసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola