GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్

Continues below advertisement

ఐపీఎల్ సీజన్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్ దూసుకెళ్లింది.  రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. బౌలింగ్, బ్యాటింగ్.. ఇలా రెండు విభాగాల్లోనూ గుజరాత్ అదరగొట్టింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది. బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ మరోసారి విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. కేవలం 4 పరుగుల దూరంలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా 45, డోనవన్ ఫెరీరా 38 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో రబాడ, హోల్డర్ రెండేసి వికెట్లు తీశారు.

అయితే 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ త్వరగానే చేజ్ చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా సాయి సుదర్శన్ 58 పరుగులతో మెరిశాడు. దాంతో గుజరాత్ 18.4 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola