Gautam Gambhir in Asia Cup 2025 | గంభీర్ 15 ఏళ్ల కల నెరవేరుతుందా

ఆసియా కప్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్‌ లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది టీం ఇండియా. మొదటిసారి టీం ఇండియా హెడ్ కోచ్‌గా ఆసియా కప్‌లో వ్యవహరించబోతున్నారు. కాబట్టి ఈ టోర్నమెంట్‌ గౌతమ్ గంభీర్‌కు కూడా చాలా ఇంపార్టెంట్. 

ఒక ప్లేయర్ గా గంభీర్ మూడుసార్లు ఆసియా కప్‌లో పాల్గొన్నాడు. 2008లో 6 మ్యాచ్‌ లు ఆడి 259 పరుగులు చేశాడు. అప్పుడు ఇండియా ఓడిపోయింది.  2010లో గంభీర్ 4 మ్యాచ్‌లలో 203 పరుగులు చేశాడు. ఇండియా ఆసియా కప్ ను సొంతం చేసుకుంది. 2012 ఆసియా కప్‌లో గంభీర్‌ 3 మ్యాచ్‌లలో 111 పరుగులు చేసాడు. ఆ టోర్నమెంట్ లో ఇండియా ఓడిపోయింది. 

సో 2010లో ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది భారత్. అప్పుడు ప్లేయర్ గా ఉన్న గంబీర్ ఇప్పుడు హెడ్ కోచ్ అయ్యాడు. 15 సంవత్సరాల తర్వాత మళ్ళి ఆసియా కప్ గెలిపించే ఛాన్స్ గంబీర్ కు వచ్చింది. ఆసియా కప్ ను సొంతం చేసుకోవడానికి గంభీర్ ఎలాంటి ప్లాన్స్ వేస్తాడో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola