Gautam Gambhir about Surya T20 Captaincy | టీ20 కెప్టెన్సీపై హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) తన 360 డిగ్రీ బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించడమే కాకుండా ఇప్పుడు కెప్టెన్‌గానూ అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) , సూర్య లీడర్ షిప్ క్వాలిటీస్ పై ప్రశంసలు కురిపించారు. 

టీ20 వరల్డ్ కప్‌లో ( T20 World Cup ) భాగంగా యూఎస్‌ఏతో ( India vs  USA ) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ తర్వాత గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ప్లేయర్ గా ఎవరైనా తప్పులు చేయొచ్చు, కానీ కెప్టెన్‌గా సూర్య తీసుకుంటున్న నిర్ణయాలు సూపర్. అతను మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ, తోటి ప్లేయర్స్ తో కమ్యూనికేట్ చేసే విధానం నాకు బాగా నచ్చింది. సూర్య కెప్టెన్సీ వల్ల కోచ్‌గా నా పని చాలా సులభం అవుతోంది" అని గంభీర్ అన్నారు. 

టీమ్ వాతావరణాన్ని పాజిటివ్‌గా ఉంచడంలో స్కై కీలక పాత్ర పోషిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఒక దశలో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి తన టీమ్ ను ఆదుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola