Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు శుబ్మన్ గిల్ గాయపడడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఆసియా కప్ మొదలైనప్పటి నుంచి కెప్టెన్ శుబ్మన్ గిల్ కు రెస్ట్ దొరకలేదు. టెస్టు, టీ20, వన్డే ఇలా మూడు ఫార్మాట్లలో గిల్ బిజీ అయ్యాడు. దాంతో ప్లేయర్స్ కు రెస్ట్ అవసరమని .. మెంటల్ గా ఫిట్ గా ఉంటేనే గ్రౌండ్ లో గేమ్ బాగా ఆడుతారని అంటున్నారు విశ్లేషకులు.
కోల్‌కతాలో జరిగిన మొదటి టెస్ట్‌లో మెడకు గాయం అవడంతో గిల్‌ను రెండో టెస్ట్ నుంచి తప్పించారు. ఎలాగైనా గెలవాల్సిన మ్యాచ్ లో గిల్ లేకపోవంపై వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై చర్చ మొదలయింది.
అయితే భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఈ విషయంపై కీలక వ్యాఖలు చేసారని అంటున్నారు క్రికెట్ నిపుణుడు ఆకాష్ చోప్రా. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కావాలంటే ఐపీఎల్ స్కిప్ చెయ్యాలి అని అన్నారట కోచ్ గంభీర్. ఐపీఎల్ లో టీమ్ కు కెప్టెన్ గా ఉండడం ఒత్తిడిగా అనిపిస్తే, కెప్టెన్సీ చేయకండి. భారత్ కోసం ఆడేటప్పుడు ఫిట్‌గా ఉంటే, మానసిక అలసట అనేదే ఉండదు” అని గౌతమ్ గంభీర్ అన్నారట.
దాంతో గంభీర్ వ్యాఖ్యలపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వకపోతే సర్రిగా పెర్ఫర్మ్ చేయరని...అలాగే మొదటి టెస్ట్ లో ఇండియా ఓటమికి అది కూడా ఒక కారణం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.