Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో టీమిండియా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గత రెండు సార్లు ఫైనల్ చేరిన భారత్, ఈసారి మాత్రం పాయింట్స్ టేబుల్‌లో ఏకంగా 6వ స్థానానికి పడిపోయింది. 9 మ్యాచ్‌ల్లో 4 ఓటములతో ఫైనల్ బెర్త్ చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా టాప్‌లో ఉంటే మనకంటే ముందు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ ఫైనల్ చేరడం కష్టం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితులపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "మేం ఎప్పుడూ ఆశావాదంతోనే ఉంటాం. WTC ఫైనల్ చేరడానికి మా కృషి చేస్తాం. మా ప్లేయర్స్ టాలెంట్ పై మాకు నమ్మకం ఉంది. ఒకటి రెండు సిరీస్‌లు ఓడినంత మాత్రాన.. మేం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గెలవలేమని అనుకోవడానికి ఎలాంటి కారణం లేదు" అంటూ గంభీర్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

భారత్ ఈ సైకిల్‌లో ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగా, సౌతాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయింది. ప్రస్తుతం భారత్ విన్నింగ్ పర్సంటేజ్ కేవలం 48.15 మాత్రమే. టీమిండియా ఫైనల్ చేరాలంటే రాబోయే 9 మ్యాచ్‌ల్లో కనీసం 7 మ్యాచ్‌లు ఖచ్చితంగా గెలవాలి. ఇందులో శ్రీలంకలో 2, న్యూజిలాండ్‌లో 2, సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో 5 టెస్టులు ఉన్నాయి. మరి గంభీర్ నమ్మకాన్ని నిలబెట్టి మనోళ్లు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారా లేదా అన్నది చూడలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola