Gambhir Master Plan T20WC Ind vs USA | భారత్ విజయం వెనుక గంభీర్ మాస్టర్ ప్లాన్

Continues below advertisement

టీ20 ప్రపంచకప్ 2026లో ( T20 World Cup 2026 ) అమెరికాపై టీమిండియా విజయం సాధించింది. ఈ విజయానికి కారణం కేవలం ప్లేయర్స్ మాత్రమే కాదు, కోచ్ గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir ) మాస్టర్ ప్లాన్ కూడా ఉందని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) స్పష్టం చేశాడు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 77 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును సూర్య సూపర్ ఇన్నింగ్స్ ఆడి ఆదుకున్నాడు.

మ్యాచ్ తర్వాత సూర్య మాట్లాడుతూ.. ఓటమి అంచున ఉన్న టైంలో కోచ్ గంభీర్ ఇచ్చిన సలహానే మ్యాచ్ మొత్తని మార్చేశామని అన్నాడు. "14 ఓవర్ల తర్వాత వచ్చిన డ్రింక్స్ బ్రేక్ సమయంలో గౌతీ భాయ్ నా దెగ్గరికి వచ్చి ఒకటే చెప్పారు. పిచ్ చాలా స్లోగా ఉంది, ఇది 190 పరుగుల వికెట్ కాదు, కేవలం 140 పరుగుల పిచ్ మాత్రమే. కాబట్టి అనవసర షాట్లు ఆడకుండా చివరి వరకు క్రీజులో ఉండు. స్కోరు అదే వస్తుంది అని ధైర్యం చెప్పారు. ఆయన మాటలే నాలో నమ్మకాన్ని నింపాయి" అని సూర్య వెల్లడించాడు.

ముంబైలోని ఆజాద్ మైదాన్, క్రాస్ మైదాన్‌లలో ఆడిన అనుభవం తనకు ఈ స్లో పిచ్‌పై బ్యాటింగ్ చేయడానికి ఉపయోగపడిందని సూర్య అన్నాడు. "వాంఖడే పిచ్ ఈరోజు డిఫరెంట్ గా ఉంది. ఎండ లేకపోవడం వల్ల పిచ్ రోలింగ్ సరిగ్గా అవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆడాలో నాకు తెలుసు. 77/6 స్కోరు వద్ద చాలా ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎవరో ఒకరు ఆఖరి వరకు ఉండాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola