French Open Clinched by Rafael Nadal : 14వసారి ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకున్న నాదల్ | ABP Desam

French Open Final లో Spain Bull Rafael Nadal కైవసం చేసుకున్నాడు. ప్రత్యర్థి కాస్పర్ రూడ్ పై 6-3, 6-3, 6-0 తో వరుసగా మూడు సెట్లలోనూ గెలిచి పద్నాలుగో సారి ఫ్రెంచ్ ఓపెన్ కప్ ను ముద్దాడాడు. ఎర్రమట్టి కోర్టులో ఇన్ని టైటిళ్లు గెలుచుకున్న ఆటగాడు టెన్నిస్ చరిత్రలోనే లేకపోగా....కెరీర్ మొత్తంగానూ 22 వ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను గెలిచి తన సమకాలీకులు రోజర్ ఫెదరర్, జకోవిచ్ కంటే రెండు అడుగులు ఎత్తున నిలబడ్డాడు రఫా. స్పెయిన్ బుల్ ధాటికి ప్రత్యర్థి కాస్పర్ రూడ్ విస్తుపోగా...తనకు మాత్రమే సొంతమైన మైదానంలో రఫా రఫ్పాడించేసి పద్నాలుగో సారి ఫ్రెంచ్ కిస్ పెట్టి...తనెందుకు మట్టికోర్టులో మొనగాడో మరోసారి నిరూపించుకున్నాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola